VH: ఓబీసీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలుశిక్ష నన్ను బాధించింది: వీహెచ్

  • దాణా స్కాంలో లాలూకు ఐదేళ్ల జైలు
  • రూ.60 లక్షల జరిమానా
  • మోదీతో చేతులు కలిపితే జైలుకు వెళ్లేవారు కాదన్న వీహెచ్
  • లాలూ జైలుకు వెళ్లేందుకే సిద్ధపడ్డారని వ్యాఖ్య  
VH responds on jail term for Lalu Prasad Yadav

దాణా కుంభకోణంలో చివరిదైన ఐదో కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు ఐదేళ్ల జైలు, రూ.60 లక్షల జరిమానా విధించడం తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఓబీసీ వర్గానికి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలుశిక్ష పడడం తనను బాధించిందని వీహెచ్ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షం లేకుండా చేయాలనేది మోదీ కుట్ర అని ఆరోపించారు. బీజేపీలో చేరితే కేసులు పట్టించుకోవడంలేదని అన్నారు. మోదీతో చేతులు కలిపి ఉంటే లాలూ జైలుకు వెళ్లేవారు కాదని అభిప్రాయపడ్డారు. లాలూ జైలుకు వెళ్లడానికి సిద్ధమయ్యారు కానీ, మోదీతో మాత్రం చేతులు కలపలేదని పేర్కొన్నారు.

ఇక, కాంగ్రెస్ పార్టీ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యం కాదని వీహెచ్ స్పష్టం చేశారు. మమతా బెనర్జీ, సంజయ్ రౌత్ కూడా ఇదే విషయం చెప్పారని తెలిపారు. కేసీఆర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News