Vijay Devarakonda: 'రష్మికతో పెళ్లి' అనే వార్తలపై విజయ్ దేవరకొండ స్పందన!

Vijay Devarakonda response on news of his marriage with Rashmika Mandanna
  • రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు
  • పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కూడా కవరేజ్
  • నాన్సెన్స్ అంటూ కొట్టిపడేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ లో బ్యూటిఫుల్ పెయిర్ ఎవరంటే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ అని చాలా మంది టక్కున చెప్పేస్తారు. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మరోవైపు, వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల వీరిద్దరూ ముంబైలో కెమెరా కంటికి చిక్కారు. దీంతో వీరిపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారే రూమర్లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మీడియా సైతం ఈ అంశంపై కథనాలను ప్రచురిస్తోంది.

ఈ నేపథ్యంలో, ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా స్పందించాడు. 'నాన్సెన్స్' అంటూ కొట్టిపడేశాడు. ఇలాంటి వార్తలు తమకు అవసరం లేదని చెప్పాడు.  
Vijay Devarakonda
Rashmika Mandanna
Marriage
Tollywood

More Telugu News