Mekapati Goutham Reddy: మరికాసేపట్లో నెల్లూరుకు మేకపాటి పార్థివ దేహం

AP Minister Mekapati Goutham Reddy dead body will reached nellore today
  • గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మేకపాటి 
  • ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి నెల్లూరుకు పార్థివ దేహం
  • రేపు ఉదయం అంత్యక్రియలు
  • అమెరికా నుంచి బయలుదేరిన మేకపాటి కుమారుడు
  • రాత్రి 11 గంటలకు నెల్లూరు చేరుకునే అవకాశం
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని మరికాసేపట్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి 10 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి పార్థివ దేహాన్ని తరలిస్తారు. వెంట తల్లి మణిమంజరి, భార్య శ్రీకీర్తి వెళ్లనున్నారు. 11.15 గంటలకు నెల్లూరు జిల్లా పోలీస్ గ్రౌండ్‌కు చాపర్ చేరుకుంటుంది. 11.25 గంటలకు డైకాస్ రోడ్డులోని నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మేకపాటి భౌతిక కాయం చేరుతుంది.

అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారు. మరోవైపు, అమెరికాలో ఉన్న మేకపాటి కుమారుడు కృష్ణార్జున రెడ్డి ఇండియాకు బయలుదేరారు. రాత్రి 11 గంటలకు ఆయన నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది

ప్రభుత్వ లాంఛనాలతో రేపు ఉదయం 11 గంటలకు మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన బాధ్యతలను మంత్రి ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్‌లకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పగించారు.
Mekapati Goutham Reddy
Nellore District
Andhra Pradesh

More Telugu News