Kishan Reddy: ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లు తెలంగాణ‌లో ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

  • అగ్ర‌వ‌ర్ణాల్లోని పేద‌ల కోసం ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లు
  • రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌తో మూడేళ్ల కింద‌టే కేంద్రం ఉత్త‌ర్వులు
  • కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ‌
  • ఈడ‌బ్ల్యూఎస్ ఎందుకు అమ‌లు చేయ‌ట్లేద‌ని ప్ర‌శ్న‌
kishan reddy writes letter to ts sm kcr

అగ్ర‌వ‌ర్ణాల్లో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారి కోసం ఎక‌న‌మిక‌ల్లీ వీక‌ర్ సెక్ష‌న్ (ఈడబ్ల్యూఎస్‌) రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేయాలంటూ కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు మూడేళ్ల కింద‌టే దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేర‌కు 103 రాజ్యాంగ స‌వ‌ర‌ణ చ‌ట్టం కూడా చేసింది. అయితే ఆ రిజ‌ర్వేష‌న్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌డం లేద‌ట‌. ఈ విష‌యాన్ని తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోమ‌వారం నాడు బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తూ కిష‌న్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సోమ‌వారం ఓ లేఖ రాశారు. రాజ్యాంగానికి స‌వ‌ర‌ణ చేసి మ‌రీ అమ‌లులోకి తీసుకువ‌చ్చిన ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌ను ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని కేసీఆర్‌ను కిష‌న్ రెడ్డి త‌న లేఖలో ప్రశ్నించారు. రాజ్యాంగానికి ఈ స‌వ‌ర‌ణ చేసి మూడేళ్లు కావ‌స్తున్నా.. ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లు ఎందుకు అమ‌లు చేయ‌ర‌ని కూడా కిష‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.

More Telugu News