మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన పవన్ కల్యాణ్
- ఏపీ మంత్రి మేకపాటి ఆకస్మిక మృతి
- మేకపాటి నివాసానికి వచ్చిన పవన్ కల్యాణ్
- మంత్రి కుటుంబ సభ్యులకు పరామర్శ
- వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వైనం
అంతకుముందు పవన్ ట్విట్టర్ లో స్పందిస్తూ, గౌతమ్ రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం అని పేర్కొన్నారు. రాష్ట్రమంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరమని పేర్కొన్నారు.