Ayyanna Patrudu: మంత్రి శవం వద్ద కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎలా వెకిలి జోకులు వేసుకుంటున్నారో చూడండి: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu fires on Kodali Nani and Vallabhaneni Vamsi
  • ఏపీ మంత్రి మేకపాటి హఠాన్మరణం
  • హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో భౌతికకాయం
  • సందర్శించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
  • ఇలాంటి వారిని ఏమనాలి? అంటూ అయ్యన్న ఆగ్రహం
ఈ ఉదయం హఠాన్మరణానికి గురైన ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ నివాసంలో ఉంచారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో స్పందించారు. ఒక పక్కన తమ సహచర మంత్రి శవం ఉండగా మరో మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలి జోకులు వేసుకుంటున్నారని విమర్శించారు.

కేవలం 49 ఏళ్ల వయసులో హఠాత్తుగా చనిపోయాడన్న బాధ ఏమాత్రం లేకుండా ఎలా నవ్వుకుంటూ ఉన్నారో చూడండి అంటూ, అందుకు సంబంధించిన వీడియోను కూడా అయ్యన్నపాత్రుడు పంచుకున్నారు. ఇలాంటి వారిని సైకోలు అనాలా? ఇంకేమనాలి? అని ప్రశ్నించారు.
Ayyanna Patrudu
Kodali Nani
Vallabhaneni Vamsi
Mekapati Goutham Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News