లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానా
- దాణా కుంభకోణం ఐదో కేసులో శిక్ష ఖరారు చేసిన రాంచీ సీబీఐ కోర్టు
- ఐదేళ్ల జైలు శిక్ష
- రూ. 60 లక్షల జరిమానా
1990లలో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్ పై బయట ఉన్నారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్ లో ఉంది. భాగల్పూర్ ట్రెజరీ నుంచి ఇల్లీగల్ గా నిధులను విత్ డ్రా చేశారంటూ ఈ కేసు నమోదయింది.