Jagan: విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లిన జగన్.. భార్య భారతిని తీసుకుని హైదరాబాదుకు రానున్న సీఎం!

Jagan went to Bengaluru to pickup his wife Bharathi
  • గౌతమ్‌రెడ్డికి నివాళి అర్పించేందుకు హైదరాబాదుకు వస్తున్న జగన్
  • బెంగళూరులో ఉన్న సీఎం సతీమణి భారతి
  • కాసేపట్లో భారతితో కలిసి హైదరాబాద్ చేరుకోనున్న జగన్
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తొలి నుంచి కూడా గౌతమ్ తో జగన్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. మరోవైపు గౌతమ్ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు ఆయన హైదరాబాదుకు రానున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాదుకు వస్తారని తొలుత అందరూ భావించారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లారు.

ఆయన భార్య భారతి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. దీంతో, బెంగళూరులో ఆమెను తీసుకుని ఆయన హైదరాబాదుకు రానున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాదుకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు మంత్రులు హైదరాబాదులోని మేకపాటి నివాసానికి చేరుకున్నారు.
Jagan
Wife
Bharathi
Bengaluru
Mekapati Goutham Reddy

More Telugu News