Mekapati Goutham Reddy: జూబ్లీహిల్స్‌లోని నివాసానికి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

mekapati dead body shifts to his home
  • జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసానికి ప‌లువురు నేత‌లు
  • భారీగా చేరుకున్న‌ బంధువులు, వైసీపీ కార్యకర్తలు
  • పోలీసుల భ‌ద్ర‌త ఏర్పాట్లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పార్థివ దేహాన్ని హైద‌రాబాద్‌ అపోలో ఆసుప‌త్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసానికి ప‌లువురు నేత‌లు, బంధువులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

ఆ ప్రాంతంలో పోలీసులు భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ హైద‌రాబాద్ చేరుకున్న వెంట‌నే అక్క‌డికి వెళ్లి ప‌రామ‌ర్శించ‌నున్నారు. అలాగే, ప‌లువురు ఏపీ నేత‌లు కూడా హైద‌రాబాద్‌ బ‌య‌లుదేర‌నున్నారు. కాగా, జూబ్లీహిల్స్‌లోని నివాసం వ‌ద్ద ఆయ‌న పార్థివ దేహాన్ని కొద్దిసేపు ఉంచాక మ‌ళ్లీ ఏపీకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది.
Mekapati Goutham Reddy
YSRCP
Jagan

More Telugu News