Telangana: తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్..! రెరా కింద భారీగా ప్రాజెక్టుల నమోదు

  • ఫిబ్రవరి నాటికి 4,002 ప్రాజెక్టులు
  • ఏపీలో 2,248 ప్రాజెక్టులు
  • మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్
  • మొదటి మూడు స్థానాలు వీటివే
Telangana at number 4 in projects registered with RERA

తెలంగాణలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కింద భారీగా ప్రాజెక్టులు నమోదవుతున్నాయి. రెరా కింద నమోదైన ప్రాజెక్టుల సంఖ్యా పరంగా చూస్తే దేశంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది.

తెలంగాణ రెరా కింద ఫిబ్రవరి నాటికి 4,002 ప్రాజెక్టులు నమోదయ్యాయి. అలాగే, 2,017 మంది ఏజెంట్లు కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర 33,154 రెరా నమోదిత ప్రాజెక్టులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్ 9,689 ప్రాజెక్టులు, మధ్యప్రదేశ్ 4,016 ప్రాజెక్టులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రెరా కింద 2,248 ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయి. 151 ఏజెంట్లు పేర్లను నమోదు చేసుకున్నారు. రెరా అన్నది రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ సంస్థ. దీని కింద నమోదైన ప్రాజెక్టుల్లో ప్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసే వారికి చట్టపరంగా రక్షణ ఉంటుంది. నిబంధనలను పాటించే ప్రాజెక్టులకే రెరా అనుమతులు ఇస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే కేసులు, భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

More Telugu News