Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం.. భార్య తండ్రి కన్నుమూత!

Ashwini Puneeth Rajkumars father passes away
  • పునీత్ మృతి తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన మామ రేవనాథ్
  • గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచిన రేవనాథ్
  • ఆయన వయసు 78 సంవత్సరాలు
కన్నడ స్టార్ హీరో, దివంగత పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. పునీత్ భార్య అశ్విని తండ్రి భగ్మనే రేవనాథ్ కన్నుమూశారు. పునీత్ మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన రేవనాథ్... అప్పటి నుంచి తీవ్ర ఒత్తిడిలోనే ఉంటూ వచ్చారు. ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు.

గుండెపోటు వచ్చిన రేవంత్ ను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవలే భర్తను, ఇప్పుడు తండ్రిని కోల్పోయిన అశ్విని పరిస్థితిని చూసి అందరూ ఆవేదనకు గురవుతున్నారు.
Puneeth Raj Kumar
Father in law
dead

More Telugu News