Nalgonda District: భర్త రెండో పెళ్లి చేసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. కృష్ణా జిల్లాలో ఘటన

 Wife caught red handed while husband is remarrying
  • నాలుగేళ్ల క్రితం సరితను పెళ్లి చేసుకున్న మధుబాబు
  • వరకట్న వేధింపులకు తాళలేక మూడేళ్లుగా పుట్టింట్లో సరిత
  • మధుబాబు మళ్లీ పెళ్లి ప్రయత్నాలు, రెండుసార్లు అడ్డుకున్న భార్య
  • మూడో ప్రయత్నాన్నీ అడ్డుకున్న వైనం
భార్య కళ్లుగప్పి గుట్టుగా రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుందో భార్య. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన మధుబాబుకు హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సరితతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన వెంటనే సరితకు అత్తింటి నుంచి వరకట్న వేధింపులు ఎదురయ్యాయి. దీంతో పుట్టింటికి వెళ్లిపోయిన సరిత మూడేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మధుబాబు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు యత్నించగా సరిత రెండుసార్లు అడ్డుకుంది. అయినప్పటికీ పెళ్లి ప్రయత్నాలు ఆపని మధుబాబు ఈసారి కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖాయం చేసుకున్నాడు. ఆదివారం పెనుగంచిప్రోలు చేరుకుని తిరుపతమ్మ ఆలయంలో వివాహం చేసుకునేందుకు వచ్చారు. వివాహం జరుగుతుండగా సరిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మధుబాబుపై దాడిచేసి వివాహాన్ని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా మధుబాబుకు గతంలోనే వివాహం జరిగిన విషయాన్ని వధువు కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు కూడా మధుబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం సరిత కుటుంబసభ్యులు మధుబాబును పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విషయం చెప్పగా, భువనగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఇప్పటికే కేసు విచారణలో ఉండడంతో పెనుగంచిప్రోలులో కేసులు అవసరం లేదని అక్కడి పోలీసులు చెప్పారు.
Nalgonda District
Hyderabad
Marriage
Penuganchiprolu
Krishna District

More Telugu News