Uttar Pradesh: యూపీలో 18 ఏళ్ల నాటి నకిలీ ఎన్‌కౌంటర్ కేసు.. ఎస్పీ సహా 18 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్

18 UP Police Officers Charged In Fake Encounter Case
  • దోపిడీ కేసుల్లో ప్రహ్లాద్, ధన్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆ తర్వాత కాల్చి చంపిన వైనం
  • కోర్టును ఆశ్రయించిన ప్రహ్లాద్ సోదరుడు రాంకీర్తి
ఉత్తరప్రదేశ్‌లో 18 ఏళ్ల క్రితం జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ సహా 18 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 3 నవంబరు 2004లో షాజహాన్‌పూర్ జిల్లా జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాచుపూర్ గ్రామానికి చెందిన ప్రహ్లాద్, ధన్‌పాల్ అనే వ్యక్తులను దోపిడీ కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ తర్వాత వారిని కాల్చి చంపి మృతదేహాలను తీసుకెళ్లారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రహ్లాద్ సోదరుడు రాంకీర్తి వివిధ కమిషన్లను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 4 నవంబరు 2012లో చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఎన్‌కౌంటర్ జరిగి చాలాకాలం గడిచిపోవడంతో పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో రాంకీర్తి డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. విచారించిన చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అభాపాల్ నాటి ఎస్పీ సుశీల్ కుమార్, అదనపు ఎస్పీ మాతా ప్రసాద్ సహా 18 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు.
Uttar Pradesh
Fake Encounter
Police

More Telugu News