Nagaratnamma: 62 ఏళ్ల వయసులో చీరకట్టులో ట్రెక్కింగ్ చేసిన బామ్మ

Old woman trekking in saree went viral
  • సాహసం చేసిన బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ 
  • అగస్త్య కూడమ్ పర్వతాన్ని ఎక్కిన వైనం
  • వీడియో వైరల్

సాధారణంగా 60 ఏళ్లు దాటాక వార్దక్య ఛాయలు కనిపించడం సహజం. అయితే, బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ వంటి వృద్ధులు వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే అని చాటుతుంటారు. 62 ఏళ్ల నాగరత్నమ్మ ఎంతో కష్టమైన ట్రెక్కింగ్ ను అవలీలగా చేస్తుంది. పశ్చిమ కనుమల్లో అత్యంత క్లిష్టమైన ఓ పర్వతాన్ని నాగరత్నమ్మ విజయవంతంగా అధిరోహించింది. అది కూడా చీరకట్టులో ఆమె ట్రెక్కింగ్ చేయడం విస్తుగొలుపుతుంది.

ఆ పర్వతం పేరు అగస్త్య కూడమ్. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉంది. సహ్యాద్రి పర్వతశ్రేణిలో ఇదే అత్యంత ఎత్తయిన పర్వతం. నాగరత్నమ్మ ఈ పర్వతాన్ని ఫిబ్రవరి 16న తన కుమారుడు, అతడి స్నేహితులతో కలిసి అధిరోహించింది.

పెళ్లయిన తర్వాత 40 ఏళ్లపాటు కుటుంబానికే అంకితం అయ్యాయని, పిల్లలు ఎవరి జీవితాల్లో వారు స్థిరపడడంతో తనకు వెసులుబాటు దొరికిందని నాగరత్నమ్మ చెబుతోంది. కొండలెక్కడం అనేది తనకెంతో ఇష్టమని, తన లక్ష్యాలను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నానని తెలిపింది. కాగా, నాగరత్నమ్మ పర్వతారోహణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News