Ram Nath Kovind: విశాఖలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్

AP Governor and CM welcomes President Ramnath Kovind in Vizag
  • ఐఎన్ఎస్ డేగాకు విచ్చేసిన రాష్ట్రపతి
  • పుష్పగుచ్ఛాలు అందించిన గవర్నర్, సీఎం
  • జ్ఞాపికను బహూకరించిన సీఎం జగన్
  • రేపు విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ
  • హాజరుకానున్న రాష్ట్రపతి

తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ సాయంత్రం విశాఖ వచ్చారు. ఆయనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి సీఎం జగన్ ప్రత్యేకంగా జ్ఞాపికను బహూకరించారు. సోమవారం నాడు విశాఖలోని ఇక్కడి ఐఎన్ఎస్ డేగాలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్) నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News