Pawan Kalyan: అభిమాని అత్యుత్సాహం... తృటిలో ప్రమాదం తప్పించుకున్న పవన్ కల్యాణ్

 Pawan narrowly escapes unhurt in unusual incident
  • నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ
  • విచ్చేసిన పవన్ కల్యాణ్
  • పోటెత్తిన అభిమానులు, జనసైనికులు
  • వాహనంపై పవన్ నిల్చుండగా దూసుకొచ్చిన అభిమాని
జనసేనాని పవన్ కల్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొనేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వచ్చారు. ఆయన రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నది మొదలు... నరసాపురం చేరుకునేవరకు అభిమానుల కోలాహలం అంతాఇంతా కాదు. పవన్ కోసం జనసైనికులు, ఫ్యాన్స్ పోటెత్తారు. ఈ సందర్భంగా పవన్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు.

తన వాహనంలోంచి పైకి లేచి నిలబడి పవన్ అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఓ అభిమాని అకస్మాత్తుగా పవన్ ఉన్న వాహనంపైకి వచ్చాడు. అతడు వేగంగా దూసుకువచ్చి పవన్ ను ఢీకొట్టాడు. దాంతో పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. అయితే ఆయన కారుపైనే చతికిలపడినట్టుగా కూలబడడంతో ప్రమాదం తప్పినట్టయింది. అనంతరం పైకి లేచి యథావిధిగా ముందుకు సాగారు. కాగా, రోడ్ షో సందర్భంగా ఓ యువతి కారు బాయ్ నెట్ పైకి ఎక్కి మరీ పవన్ కు హారతి ఇవ్వడం కనిపించింది.
Pawan Kalyan
Narasapuram
Fans
Janasena
West Godavari District

More Telugu News