CM Jagan: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన సీఎం జగన్

CM Jagan attends Dy CM Amzad Basha daughter wedding in Kadapa
  • కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
  • విట్రియో రెటీనా కంటి ఆసుపత్రి ప్రారంభం
  • ఆపై అంజాద్ బాషా తనయ పెళ్లి వేడుకకు పయనం
  • వధూవరులను ఆశీర్వదించిన వైనం

ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పెళ్లి వేడుకకు హాజరైన అనంతరం సీఎం జగన్ గన్నవరం బయల్దేరారు.
అంతకుముందు, కడప జిల్లా పర్యటనలో భాగంగా పుష్పగిరిలో విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్, 150 పడకల వార్డును, ఆసుపత్రిలోని ఇతర విభాగాలను పరిశీలించారు.

  • Loading...

More Telugu News