rock salt: ‘రాక్ సాల్ట్’ చేసే మేలు ఇంతింత కాదయా. !

  • సహజసిద్ధమైన రాతి ఉప్పు ఇది
  • ఎటువంటి రసాయనాలు ఉండవు
  • దుష్ప్రభావాలకు దూరం
  • ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
amazing health benefits of rock salt

ఉప్పు లేనిదే ముద్ద దిగదు. రుచికి కీలకమైన ఉప్పు పరిమితి దాటితే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. నేడు మనం వాడుతున్న ఉప్పు అంతా రసాయనాల మయం. ఒకప్పుడు సహజసిద్ధమైన సముద్రపు ఉప్పు లభించేది. కానీ నేడు శుద్ధి చేసి, ఐయోడిన్ కలిపి విక్రయించే ఉప్పుతో ప్రయోజనాలతోపాటు నష్టం కూడా ఉంది. థైరాయిడ్ సమస్య నేడు ఇంతలా పెరిగిపోవడానికి అయోడైజ్డ్ సాల్ట్ వినియోగమే కారణమన్న వాదనలు కూడా ఉన్నాయి.
 
నేడు ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం పెరిగిపోయింది. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు వీలుగా వీటిల్లో ఉప్పును కాస్తంత అధిక మోతాదులోనే జోడిస్తుంటారు. బయట తీసుకునే ఆహార పదార్థాలకు సంబంధించి వినియోగదారులుగా మన ప్రమేయం పెద్దగా ఉండదు. అందుకని కనీసం ఇంట్లో అయినా మంచి చేసే ఉప్పుకు చోటివ్వడం ఆరోగ్యరీత్యా అవసరం. అందుకు ఉన్న మార్గం రాక్ సాల్ట్!

రాక్ సాల్ట్
హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇది లభిస్తుంది. రాతి రూపంలో ఉంటుంది. స్వచ్ఛమైనది. ఎటువంటి రసాయనాలు లేనిది. శుద్ధి చేయనిది. కనుక దుష్ప్రభావాలు ఉండవు.
 
జీర్ణానికి మేలు
జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారు టేబుల్ సాల్ట్ ను తీసేసి, రాక్ సాల్ట్ ను వినియోగించి చూడండి. ఉపశమనం కనిపిస్తుంది. గుండెమంట, కడుపులో నొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలకు రాక్ సాల్ట్ చక్కటి ఇంటి ఔషధమని ఆయుర్వేదం చెబుతోంది.

గొంతు నొప్పి
గొంతు నొప్పి, గొంతు పచ్చి చేస్తే గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసుకుని గలగరించమని సూచిస్తుంటారు. ఇందుకు రాక్ సాల్ట్ మరీ మంచిది. అమెరికన్ కేన్సర్ సొసైటీ కూడా దీన్నే సూచిస్తోంది. ముక్కులు మూసుకుపోవడం, జులుబు, దగ్గు, నోటి సమస్యలు, టాన్సిలైటిస్, ఆస్తమా సమస్యల్లో రాక్ సాల్ట్ వల్ల సానుకూల ఫలితం ఉంటుంది.

చర్మం ఆరోగ్యకరం
చర్మం ఆరోగ్యానికి కూడా రాక్ సాల్ట్ మేలు చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో, కొత్త కాంతిని ఇవ్వడంలో రాక్ సాల్ట్ మంచి ఫలితమిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. దీంతో చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇదొక చక్కని పరిష్కారం అవుతుంది.
 
కండరాల నొప్పులు
శరీరంలో ఎలక్ట్రోలైట్స్ అయిన పొటాషియం, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం మధ్య సమతుల్యత దెబ్బతింటే కండరాల నొప్పులకు దారితీస్తుంది. రాక్ సాల్ట్ లో పొటాషియం ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల పొటాషియం లోపం తగ్గడమే కాకుండా, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు.

ఒత్తిడి తగ్గిస్తుంది..
ఒత్తిడి, ఆందోళన తగ్గించంలో రాక్ సాల్ట్ ప్రభావం చూపిస్తుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఒక కప్పు సూప్ ను రాక్ సాల్ట్ తో చేసుకుని తీసుకుంటే మంచి ఉశమనం కనిపిస్తుంది. నిద్ర మంచిగా పట్టేందుకు కూడా ఇది సాయపడుతుంది.

  • Loading...

More Telugu News