IRCTC Account: ఐఆర్సీటీసీ అకౌంట్ తో ఆధార్ లింక్ చేసుకున్నారా?

  • ఒక నెలలో గరిష్టంగా ఆరు టికెట్ల వరకే బుకింగ్
  • ఆధార్ అనుసంధానిస్తే 12 టికెట్ల బుకింగ్
  • మొబైల్ ఫోన్ తో సులభంగా చేసుకోవచ్చు
How to link Aadhaar card to IRCTC Account online


ఐఆర్సీటీసీ ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకునే వారు చాలా మందే ఉన్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో నిమిషాల వ్యవధిలోనే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు లభించింది. అయితే ఐఆర్సీటీసీ ఖాతాకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రతీ యూజర్ తన ఖాతాకు ఆధార్ నంబర్ జోడించుకోవాలి. అప్పుడే ఒక నెలలో 6 కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేసుకోగలరు.

ఒక నెలలో ఆరు టికెట్ల వరకు బుక్ చేసుకోవడానికి ఆధార్ అనుసంధానం అవసరం లేదు. కానీ, ఏదైనా ఒక నెలలో ఎక్కువ సందర్భాలు ప్రయాణించాల్సి వస్తే..? అప్పటికప్పుడు ఆధార్ అనుసంధానం కోసం ప్రయత్నించే కంటే.. ముందే ఆ పనిచేసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు. ఆధార్ అనుసంధానంతో వచ్చే ప్రయోజనాలే కానీ, నష్టమేమీ లేదు. ఆధార్ అనుసంధానం తర్వాత ఐఆర్సీటీసీ ద్వారా ఒక యూజర్ ఒక నెలలో 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు.
 
ఐఆర్సీటీసీ పోర్టల్ లో లాగిన్ అయిన తర్వాత పైన కనిపించే ఆప్షన్లలో ‘అకౌంట్’ ను సెలక్ట్ చేసుకోవాలి. అందులో ‘లింక్ యువర్ ఆధార్’ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత కనిపించే పేజీలో రెండు కాలమ్స్ ఉంటాయి. ఆధార్ నెంబర్ లో ఉండే పేరును పైన కాలమ్ లో ఇవ్వాలి. కింద బాక్స్ లో ఆధార్ నెంబర్ ను ఇచ్చి ఓకే చేయాలి. తర్వాత మరో పేజీ వస్తుంది. ఆధార్ డేటా బేస్ లో నమోదై ఉన్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దానిని అక్కడ ఇచ్చి ఓకే చేయాలి. అప్పుడు తర్వాతి పేజీలో ఆధార్ డేటా బేస్ లో ఉన్న అన్ని వివరాలు కనిపిస్తాయి. అవి నిజమైనవేనని అంగీకరిస్తూ ఓకే చెప్పాలి. దాంతో విజయవంతంగా ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.

More Telugu News