Jagan: కడప జిల్లాలో ప‌ర్య‌టిస్తోన్న‌ ఏపీ సీఎం జగన్

  Jagan reaches Kadapa
  • గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జ‌గ‌న్
  • అక్కడి నుంచి కడపకు సీఎం
  • అంజద్ బాషా కుమార్తె వివాహ వేడుకకు జ‌గ‌న్
ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉద‌యం తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయ‌న అక్కడి నుంచి కడప వెళ్లారు. మొద‌ట జయరాజ్‌ గార్డెన్స్ లో డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్ బాషా కుమార్తె వివాహ వేడుకలో ఆయ‌న‌ పాల్గొంటారు. అనంత‌రం రిమ్స్‌ వద్ద ఏర్పాటు చేసిన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభిస్తారు.

సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో క‌డ‌ప‌లో భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుకు పటిష్ఠ‌ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఇప్ప‌టికే జిల్లా కలెక్టర్‌ విజయ రామరాజు ఆదేశించారు. కాగా, డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్ బాషా కుమార్తె వివాహ వేడుక‌కు మంత్రులు తానేటి వనిత, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, శంకరనారాయణ, అనిల్ కుమార్‌ యాదవ్ త‌దిత‌రులు హాజ‌ర‌వుతున్నారు.

Jagan
YSRCP
Kadapa District

More Telugu News