Telangana: ఈ దొంగ వెరైటీ గురూ.. డబ్బు, నగలను అస్సలు ముట్టుకోడు!

he is variety he thefts only clothes
  • కొడంగల్‌లో ఘటన
  • తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబాటు
  • ఆరు తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను ముట్టుకోని వైనం
  • కొత్త ప్యాంట్లు, చీరలు ఎత్తుకెళ్లిన దొంగ
దొంగతనం చేసేవాళ్ల లక్ష్యం ఏమిటి?.. డబ్బో, దస్కమో ఎత్తుకెళ్లడం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే దొంగమాత్రం కాస్తంత వెరైటీ. డబ్బు, బంగారం, నగలను అస్సలు ముట్టుకోడు. అటువైపు చూడడు కూడా. ఆ దొంగ గురించి తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే. తెలంగాణలోని తాండూరు పట్టణం కొడంగల్‌కు చెందిన మోనాచారి.. తన బంధువులు ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసి చూసేందుకు భార్యాపిల్లలతో కలిసి పరిగి వెళ్లారు. పది రోజులపాటు అక్కడే ఉన్నారు.

కొన్ని రోజులుగా తాళం వేసి ఉంటున్న ఇంటిని గమనించిన దొంగ శుక్రవారం రాత్రి తాళం పగలగొట్టి లోపలికి చొరబడ్డాడు. ఇల్లంతా శోధించాడు. బీరువా తెరిచి చూశాడు. అందులో 6 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, కొంత మొత్తంలో నగదు, దుస్తులు ఉన్నాయి. మోనాచారి ఇటీవల తన కుమారుడికి పెళ్లి చేయడంతో ఇంట్లో కొత్త దుస్తులు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ చూసిన దొంగ బంగారు ఆభరణాలు, డబ్బులను ముట్టుకోకుండా కొత్త ప్యాంట్లు, షర్టులు, చీరలు, ఇతర వస్త్రాలను మాత్రం మూటగట్టుకుని పట్టుకెళ్లాడు.

చోరీ విషయాన్ని నిన్న ఉదయం గమనించిన ఇంటి యజమానురాలు హైమావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. బంగారం, వెండి, నగదు భద్రంగానే ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. దుస్తులు మాత్రమే చోరీకి గురికావడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేసు నమోదు చేసుున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Kodangal
Thief

More Telugu News