Anchor Shyamala: యాంకర్ శ్యామల దంపతులపై సోషల్ మీడియాలో టీడీపీ విమర్శలు

TDP slams anchor Shyamala and her husband
  • శ్యామల భర్త ఓ మహిళను మోసం చేశాడన్న టీడీపీ
  • అరెస్ట్ అయ్యాడని వెల్లడి
  • క్రిమినల్స్ వైసీపీ గూటికే చేరతారని వ్యాఖ్యలు
ప్రముఖ టెలివిజన్ యాంకర్ శ్యామల, ఆమె భర్త నర్సింహారెడ్డిపై టీడీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. యాంకర్ శ్యామల భర్త అధికార పార్టీ అండ చూసుకుని ఓ మహిళను కోటి రూపాయల మేర మోసం చేయడమే కాకుండా, ఆమెను లైంగికంగానూ వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడని టీడీపీ సోషల్ మీడియాలో వెల్లడించింది. టీడీపీపై అడ్డగోలుగా ఆరోపణలు చేసి, గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఈ దంపతులు ఇప్పుడు వివేకా హత్యపై నోరెత్తరేం? అని ప్రశ్నించింది.

క్రిమినల్స్ అందరికీ ఒకటే గూడు అని, అది వైసీపీ అని టీడీపీ విమర్శించింది. నేరాల్లో ఒకరికొకరు ఆసరాగా ఉంటారని వ్యాఖ్యానించింది. "సెలబ్రిటీలకు కండువా కప్పడం, వారిని అబద్ధాల ప్రచారాలకు ఉపయోగించుకోవడం... ఇదీ వైసీపీ చేసే పని. వైసీపీని అడ్డంపెట్టుకుని జనాన్ని మోసం చేయడం... ఇది కొందరు సెలబ్రిటీలు చేసే పని" అంటూ ట్విట్టర్ లో వివరించింది.
Anchor Shyamala
Narsimhareddy
TDP
YSRCP

More Telugu News