Surya: సూర్య మూవీ నుంచి తెలుగు టీజర్ రిలీజ్!

ET movie telugu teaser released
  • సూర్య హీరోగా 'ఎతరుక్కుమ్ తునింధవన్'
  • తెలుగు టైటిల్ గా 'ఈటి'
  • కథానాయికగా ప్రియాంక మోహన్ 
  • మార్చి 10వ తేదీన విడుదల  
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో సూర్య సినిమాలు రెండు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించాయి. ఈ రెండు సినిమాలకి కూడా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. సూర్య కెరియర్లోనే ఈ రెండు సినిమాలు ప్రత్యేకమైన స్థానాన్ని పొందడం విశేషం. ఆ తరువాత ఆయన చేసిన సినిమానే 'ఎతరుక్కుమ్ తునింధవన్'.

సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాను 'ఈటి' పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతంలోని ఒక ప్రాచీన  ఆలయం .. దాని చుట్టూ అల్లుకుని ఏదో కథ ఉందనే విషయం అర్థమవుతోంది.

ఇక మరో వైపు నుంచి గ్రామీణ ప్రాంతంలోని కథానాయకుడి చుట్టూ కార్పొరేట్ విలనిజం కూడా కమ్ముకుని ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఇమాన్ సంగీతం ఈ  సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేయనున్నారు.
Surya
Priyanka Mohan
Pandiraj
ET Movie

More Telugu News