Europe: యూరప్ లో గాలికి కొట్టుకుపోతున్న జనాలు.. వీడియో ఇదిగో!

Eunice storm effects Europe
  • యూరప్ ను వణికిస్తున్న యూనిస్ తుపాను
  • గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • విమానాలు సైతం ఊగిపోతున్న వైనం
యూనిస్ తుపాను యూరప్ ను వణికిస్తోంది. తుపాను కారణంగా అక్కడ గంటకు 196 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ధాటికి జనాలు రోడ్లపై నిలువలేకపోతున్నారు. రోడ్డుపై నడుస్తున్నవారు గాలి వేగానికి కొట్టుకుపోతున్నారు. అంతేకాదు విమానాలు సైతం ఊగిపోతున్నాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి. యూరప్ అంతా ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా తీరప్రాంతాల ప్రజలు మరింత సమస్యను ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల కరెంటు తీగలు తెగిపోవడంతో అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రింది వీడియో దక్షిణ లండన్ లో తీసినది.
Europe
Eunice Storm

More Telugu News