Sachin Tendulkar: తన కుమారుడి మ్యాచ్ లకు దూరంగా ఉంటానన్న సచిన్.. ఎందుకని?

I Donot Go And Watch Arjun Play Sachin Tendulkar
  • తల్లిదండ్రులు వీక్షిస్తుంటే ఒత్తిడికి లోనవుతారు
  • స్వేచ్ఛగా, ఇష్టంగా ఆడాలన్నదే నా అభిమతం
  • ఒకవేళ చూసినా చాటు నుంచే
  • నేనున్నట్టు తెలియదు కూడా

లెజండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్.. తన కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఆడే మ్యాచ్ లను వీక్షించబోనని చెప్పారు. అర్జున్ టెండుల్కర్ ముంబై రంజీ జట్టులో భాగంగా ఉన్నాడు. అలాగే, ఇటీవలే ముగిసిన ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు అతడ్ని రూ.25 లక్షలకు కొనుగోలు చేసింది.

తన కుమారుడి మ్యాచ్ లను చూడకపోవడానికి కారణాలను సచిన్ వివరించారు. ‘‘పిల్లల మ్యాచ్ లను తల్లిదండ్రులు వీక్షిస్తుంటే వారు ఒత్తిడికి లోనవుతారు. అందుకే నేను అర్జున్ ఆడే మ్యాచ్ లకు వెళ్లి చూడాలని అనుకోవడం లేదు. అతడు పూర్తి స్వేచ్ఛతో ఆడాలి. క్రికెట్ ను ప్రేమించాలని నేను కోరుకుంటాను. అతడు ఏం చేయాలనుకున్నాడో దానిపైనే దృష్టి పెట్టాలి.  

అతడు ఆటపైనే దృషి నిలపాలి. అలాగే, ఎవరైనా (తన కుటుంబ సభ్యులు) నా మ్యాచ్ చూడడం నాకు కూడా ఇష్టం ఉండదు. ఒకవేళ నేను అర్జున్ మ్యాచ్ లకు వెళ్లినా ఎక్కడో ఒక చోటు చాటుగా ఉండి చూస్తాను. నేను అక్కడ ఉన్నట్టు అతడికి కానీ, కోచ్ కి కానీ, మరొకరికి కానీ తెలియదు‘‘ అని సచిన్ టెండుల్కర్ వివరించారు. అర్జున్ బ్యాట్ పట్టుకోవాలంటూ తాము ఒత్తిడి చేయలేదని సచిన్ స్పష్టం చేశారు. అతడికి  ఫుట్ బాల్, చెస్ ఆడడం కూడా వచ్చని, అతడి జీవితంలోకి క్రికెట్ ఆలస్యంగా వచ్చినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News