అందుకే నారా లోకేశ్ ఒక డ్యాష్ అని సంబోధిస్తా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి

19-02-2022 Sat 13:01
  • పట్టాభి అనే వ్యక్తి చంద్రబాబు వద్ద జీతానికి పని చేసే వ్యక్తి
  • కాకినాడ నుంచి రైస్ అక్రమంగా ఎక్స్ పోర్ట్ అవుతోందని అంటున్నాడు
  • అన్నీ తెలుసుకుని మాట్లాడాలని వారికి చంద్రబాబు, లోకేశ్ చెప్పాలి
Thats why I call Nara Lokesh as a Dash says Dwarampudi
టీడీపీ నేతలు నారా లోకేశ్, పట్టాభిలపై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అంటారని, టీడీపీ అధినేతను నారా చంద్రబాబు నాయుడు అంటారని... కానీ నారా లోకేశ్ ని ఏమనాలో తనకు తెలియడం లేదని అన్నారు. అందుకే లోకేశ్ ను తాను ఒక డ్యాష్ అంటానని చెప్పారు. పట్టాభి అనే వ్యక్తి టీడీపీ తొత్తు అని, చంద్రబాబు వద్ద జీతానికి పని చేసే వ్యక్తి అని ఎద్దేవా చేశారు.

కాకినాడ నుంచి అక్రమంగా రైస్ ఎక్స్ పోర్ట్ అవుతోందని పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని మండిపడ్డారు. జగన్ గురించి, వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని చంద్రబాబు, లోకేశ్ వారి తొత్తులకు చెప్పాలని అన్నారు. లేనిపోని ప్రగల్భాలు మాట్లాడటం... తోక ఛానల్, తోక పత్రికలో వాటిని వేసుకోవడం చేస్తున్నారని మండిపడ్డారు.