Ilayaraja: ఇళయరాజాకు అనుకూలంగా తీర్పు, ఆడియో సంస్థలకు షాక్‌!

Madras High Court issues orders in favour of Ilayaraja
  • ఇళయరాజా పాటలను సీడీ, క్యాసెట్ల రూపంలో విక్రయిస్తున్న ఎకో, అగి సంస్థలు
  • ఒప్పందకాలం ముగిసినా విక్రయాలను కొనసాగిస్తున్న ఆడియో సంస్థలు
  • ఒప్పందం పూర్తైన తర్వాత అమ్మకాలు జరపరాదన్న హైకోర్టు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఎకో, అగి ఆడియో సంస్థలకు షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే తాను రూపొందించిన పాటలను సీడీ, క్యాసెట్ల రూపంలో విక్రయించడానికి ఈ రెండు సంస్థలతో ఇళయరాజా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఒప్పందకాలం ముగిసినా రెన్యువల్ చేయకుండానే, ఈ సంస్థలు తన పాటలను విక్రయిస్తున్నాయని 2017లో హైకోర్టును ఇళయరాజా ఆశ్రయించారు. ఆ సమయంలో ఆడియో సంస్థలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఇళయరాజా మరోసారి అప్పీలు చేశారు.

ఈ పిటిషన్ ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంబ్ విచారించింది. ఒప్పంద కాలం పూర్తయిన తర్వాత కూడా ఇళయరాజా పాటలను బిజినెస్ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. తరుపరి విచారణను మార్చి 31వ తేదీకి వాయిదా వేసింది. తమ ఆదేశాలపై ఆడియో సంస్థలు పిటిషన్ వేసుకోవచ్చని తెలిపింది.
Ilayaraja
Tollywood
Kollywood
Madras High Court

More Telugu News