KalaTapasvi: మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం: చిరంజీవి

chiranjeevi wishes k viswanath for long life and happy birthday
  • కళాతపస్వి విశ్వనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు
  • మీరు తెలుగు వారికి అందిన వరం
  • దీర్ధాయువుతో సంతోషంగా ఉండాలి
  • ట్విట్టర్లో చిరంజీవి పోస్ట్
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు.

‘‘గురుతుల్యులు, కళాతపస్వి కే.విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు! తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి, తెలుగు సినిమా శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అజరామరం! మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో, సంతోషంగా వుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి తన ట్విట్ లో పేర్కొన్నారు.

కళాత్మకమైన సినిమాలకు కాశీనాథుని విశ్వనాథ్ పెట్టింది పేరు అని తెలిసిందే. 1982 జూన్ 11న విడుదలైన ‘శుభలేఖ’  విశ్వనాథ్ దర్వకత్వంలో చిరంజీవి నటించిన తొలి చిత్రం. చిరంజీవికి జోడిగా సుమలత నటించింది. ఆ తర్వాత విశ్వనాథ్, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన విశ్వనాథ్ నేడు 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

KalaTapasvi
K.Viswanath
birth day
wishes
chiranjevi
mega star

More Telugu News