Anasuya: వయసు తప్పుగా రాశారంటూ మహిళా జర్నలిస్టుపై అనసూయ ఆగ్రహం

Anasuya fires on a woman journalist
  • ఓ మీడియా వెబ్ సైట్లో అనసూయపై కథనం
  • వయసు 40 అని పేర్కొన్న పాత్రికేయురాలు
  • తన వయసు 36 అని వెల్లడించిన అనసూయ  

తన వయసు తప్పుగా పేర్కొన్న ఓ మీడియా రైటర్ పై టాలీవుడ్ నటి అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు మీడియా సంస్థకు చెందిన లేడీ జర్నలిస్టు... అనసూయపై ఓ స్పెషల్ స్టోరీ రాశారు. అయితే అందులో అనసూయ వయసు 40 అని ఆ మహిళా జర్నలిస్టు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలున్నా అందాల ఆరబోతకు సై అంటుందని వివరించారు.

దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించింది. తన వయసు 40 కాదని 36  ఏళ్లు అని స్పష్టం చేసింది. వయసు పెరగడం సాధారణ విషయం అని, అయితే మీడియా వ్యక్తులు వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని ఆ మహిళా జర్నలిస్టు పేరును ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేసింది. వయసు చెప్పుకోవడానికి తానేమీ సిగ్గుపడడంలేదని అనసూయ స్పష్టం చేసింది. జర్నలిజం అనేది ఓ అస్త్రం వంటిదని, దాన్ని సరైన రీతిలో ఉపయోగించకపోతే మనకే నష్టం అంటూ సదరు మీడియా ప్రతినిధికి హితవు పలికింది.

  • Loading...

More Telugu News