Scooter: షోరూంలో అన్నీ చిల్లర నాణేలు ఇచ్చి స్కూటర్ కొనుగోలు చేసిన వ్యక్తి... వీడియో ఇదిగో!

  • అసోంలో ఘటన
  • 8 నెలలుగా చిల్లర నాణేలు పోగుచేసిన వ్యక్తి
  • ప్రయాసపడి లెక్కించిన షోరూం సిబ్బంది
  • సోషల్ మీడియాలో వీడియో సందడి
Assam man bought scooter by paying only coins

అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేశాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా?... అయితే వినండి. అతడు స్కూటర్ కొనుగోలు చేసింది కరెన్సీ నోట్లతో కాదు, ఆన్ లైన్ పేమెంట్ తో అంతకన్నా కాదు. ఓ బస్తా నిండా చిల్లర నాణేలు వేసుకుని వెళ్లి షోరూంలో తనకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి ఓ స్టేషనరీ దుకాణదారు. కొత్త స్కూటర్ కొనడం కోసం 8 నెలలుగా చిల్లర పోగు చేశాడట.

అయితే, ఆ చిల్లర లెక్కించేందుకు షోరూం సిబ్బంది కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ఇతర పనులన్నీ మానుకుని ప్లాస్టిక్ ట్రేలలో వేసుకుని ఆ చిల్లర నాణేలు లెక్కించారు. ఎలాగైతేనేం... ఆ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

More Telugu News