Ram: రామ్, బోయపాటి కాంబో ఖరారు .. అధికారిక ప్రకటన!

Ram in Boyapati movie
  • రామ్ తాజా చిత్రంగా 'ది వారియర్'
  • ముగింపు దశకి చేరుకున్న చిత్రీకరణ
  • 20వ సినిమా బోయపాటితో
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
  • ఐదు భాషల్లో రిలీజ్ చేసే ఆలోచన   
'వినయ విధేయ రామ' తరువాత బోయపాటి 'అఖండ'ను పట్టాలపైకి తీసుకురావడానికి చాలా సమయం తీసుకున్నాడు. కానీ ఈ సారి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. 'అఖండ' సృష్టించిన సంచలనం కారణంగా మాంఛి ఉత్సాహంతో ఆయన మళ్లీ రంగంలోకి దిగిపోయాడు.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రామ్ హీరోగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనంటూ కొంతసేపటి క్రితం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా అయితే, హీరోగా రామ్ కి ఇది 20వ సినిమా.

ప్రస్తుతం రామ్ లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. త్వరలోనే బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  
Ram
Sriniuvasa Chitturi
Boyapati Movie

More Telugu News