West Indies: టీమిండియాతో రెండో టీ20... టాస్ గెలిచిన వెస్టిండీస్

West Indies won the toss and elected bowling in Eden Gardens
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
  • ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ నెగ్గిన భారత్
  • అదే జట్టుతో బరిలో దిగుతున్న టీమిండియా
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా లక్ష్యాన్ని ఛేదించిన తీరుతో వెస్టిండీస్ ఇవాళ్టి మ్యాచ్ లో మరో ఆలోచనకు తావులేకుండా లక్ష్యఛేదనకు మొగ్గుచూపింది. తొలి మ్యాచ్ ను నెగ్గిన ఊపులో ఉన్న టీమిండియా నేటి మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. వెస్టిండీస్ జట్టులో ఒక మార్పు చేశారు. ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ జట్టులోకి రాగా, ఫాబియన్ అలెన్ ను తప్పించారు.
West Indies
Toss
2nd T20
Team India
Eden Gardens

More Telugu News