Balakrishna: బాలయ్య కోసం రంగంలోకి దిగిన రామ్ - లక్ష్మణ్!

  • మొదలైన గోపీచంద్ మలినేని మూవీ
  • బాలకృష్ణకి ఇది 107వ సినిమా
  • కథానాయికగా శ్రుతి హాసన్
  • నెగెటివ్ రోల్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్  
Gopichand Malineni movie update

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజున సిరిసిల్లలో మొదలైంది. అక్కడ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ఫస్టు షెడ్యూల్ ను ఆరంభించారు.

ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫీని రామ్ - లక్ష్మణ్ అందిస్తున్నారు. యాక్షన్ సీన్ గురించి వారు దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోపీచంద్ మలినేని నుంచి ఇంతకుముందు వచ్చిన 'క్రాక్' సినిమాలో రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలైట్ గా నిలిచాయి.

అందువల్లనే మళ్లీ రామ్ - లక్ష్మణ్ ను ఆయన తీసుకున్నాడు. వాళ్ల నేతృత్వంలోనే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. 'అఖండ'తో బాలకృష్ణను మెప్పించిన తమన్, ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఉన్నాడు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.

More Telugu News