Pooja Hegde: ఇన్ స్టా హ్యాకింగ్ గొడవ తర్వాత.. సమంతపై పూజ హెగ్డే ప్రశంసలు

Pooja Hegde Commends Samantha after Insta War
  • అరబిక్ కూత్తు పాటకు డ్యాన్స్ వేసిన సామ్
  • వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వైనం
  • నువ్వో అద్భుతమంటూ పొగిడిన పూజ
ఇటీవల సమంత, పూజ హెగ్డే మధ్య ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పై కొద్దిగా వివాదం నడిచింది. పూజ ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఫొటో పోస్ట్ అయి ‘ఈమె ఏం బాగుందనీ’ అంటూ కామెంట్ దర్శనమిచ్చింది. అయితే, దానిపై వెంటనే స్పందించిన పూజ.. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని క్లారిటీ ఇచ్చింది. అప్పటికే ఆమె మీద సమంత అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు.

అయితే, తాజాగా సమంతపై పూజ హెగ్డే ప్రశంసలు కురిపించింది. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల విజయ్, పూజ హెగ్డే జంటగా నటించిన ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కూతు’ పాట విడుదలై సెన్సేషన్ సృష్టించింది. ఆ పాటకు సమంత విమానాశ్రయంలో స్టెప్పులేస్తూ కనిపించింది. ఆ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో ఆమె షేర్ చేసింది. ‘‘ఇంకో లేట్ నైట్ ఫ్లైటా? కానే కాదు. ఈ రాత్రి రిథమ్ హలామితి హబీబో. ఈ పాట అన్నింటికీ మించి’’ అంటూ కామెంట్ చేసింది.

దానికి పూజ హెగ్డే కూడా స్పందించింది. సమంత పోస్ట్ చేసిన అరబిక్ కూత్తు చాలెంజ్ వీడియోను రీపోస్ట్ చేసిన పూజ.. ‘సామ్.. నువ్వు అద్భుతం. నిజమే, 2022లో మరిన్ని సర్ ప్రైజ్లు ఉన్నాయేమో’’ అంటూ పోస్ట్ చేసింది. కాగా, పూజ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడంపై సమంత, చిన్మయి శ్రీపాద, డైరెక్టర్ నందిని రెడ్డి మధ్య నడిచిన ఆసక్తికర సంభాషణ బయటకు వచ్చింది. పూజ వ్యాఖ్యలపై వాళ్లు సెటైర్లు పేల్చారు. ఆ తర్వాత పూజ హెగ్డే ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.
Pooja Hegde
Samantha
Tollywood
Kollywood
Beast
Vijay

More Telugu News