Alia Bhatt: నా నెక్స్ట్ మూవీ ఇక బన్నీతోనే: అలియా భట్

Alia Bhat wants to do movie with Allu Arjun
  • చరణ్ జోడీగా చేసినందుకు హ్యాపీ
  • ఎన్టీఆర్ తో ఇంత త్వరగా ఛాన్స్ వస్తుందనుకోలేదు
  • బన్నీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం
  • ఆయనతో యాక్ట్ చేయాలనుందన్న అలియా  
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా అలియా భట్ తన జోరు చూపిస్తోంది. ఆమె తాజా చిత్రమైన 'గంగూబాయి' కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె చాలా బిజీగా ఉంది. ఇక 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో చరణ్ సరసన నాయికగా ఆమె సీత పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.

తాజా ఇంటర్వ్యూలో అలియా మాట్లాడుతూ .. తెలుగులో మొదటి సినిమా చరణ్ తో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్టీఆర్ గొప్ప డాన్సర్ ..  ఆయనతో కలిసి యాక్ట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. వెంటనే కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ తో చేసే ఛాన్స్ వచ్చింది .. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. ఆ తరువాత సినిమాను బన్నీతో చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను.

బన్నీ అద్భుతమైన డాన్సర్ .. పాత్రలో ఆయన ఇన్వాల్వ్ అయ్యే విధానం నాకు బాగా నచ్చుతుంది. ఆయనతో కలిసి యాక్ట్ చేయాలనుంది. మా ఇద్దరి కోసం ఒక స్టోరీ లైన్ కూడా అనుకున్నాను. ఇద్దరం కలిసి దుష్టశక్తులపై పోరాడే కథ అది. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కూడా త్వరలోనే వస్తుందని అనుకుంటున్నాను" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అలియా వైపు నుంచి ఆ మాత్రం ఆసక్తి ఉందంటే, ఈ కాంబినేషన్ సెట్ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.
Alia Bhatt
Charan
Allu Arjun
Junior NTR
Koratala Movie

More Telugu News