Medaram: మేడారం జాతర: సమ్మక్కకు స్వాగతం పలుకుతూ గాల్లోకి కాల్పులు జరిపిన ములుగు జిల్లా ఎస్పీ

Mulugu district SP welcomes Sammakka
  • నిన్నటి నుంచి మేడారం జాతర షురూ
  • ఇప్పటికే గద్దెనెక్కిన సారలమ్మ
  • తాజాగా సమ్మక్కను తీసుకొచ్చిన గిరిజన పూజారి
  • గద్దెనెక్కించేందుకు ఏర్పాట్లు
తెలంగాణకే తలమానికంలా నిలిచే మేడారం జాతర ఫిబ్రవరి 16న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, వనదేవత సమ్మక్కను నేడు మేడారం తీసుకువచ్చారు. చిలుకలగుట్ట వద్ద భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను ప్రధాన పూజారి కొక్కెర కిష్టయ్య కోలాహలం నడుమ ఊరేగింపుగా తీసుకురాగా, సమ్మక్కకు స్వాగతం పలుకుతూ ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు. సమ్మక్క చేరికతో మేడారం జాతర పతాకస్థాయికి చేరుకుంది.

ఇక సారలమ్మ నిన్ననే మేడారం చేరుకుంది. సారలమ్మ గద్దెపైకి చేరడంతో జాతర షురూ అయింది. సమ్మక్కను కూడా గిరిజన పూజారులు ప్రభుత్వ లాంఛనాల నడుమ గద్దెపైకి చేర్చనున్నారు. దాంతో మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ముగియనుంది.
Medaram
Sammakka
Saralamma
Telangana

More Telugu News