Kalvakuntla Kavitha: సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కవిత

Kavitha offers special prayers in Balkampet Ellamma Temple on CM KCR birthday
  • నేడు కేసీఆర్ జన్మదినం
  • తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు జరుపుతున్న టీఆర్ఎస్ శ్రేణులు
  • మంత్రి తలసానితో కలిసి ఆలయానికి వచ్చిన కవిత
  • తండ్రి పేరిట పూజలు చేయించిన తనయ 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు 68వ పడిలో అడుగుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. కాగా, కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తండ్రి జన్మదినం సందర్భంగా హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయ వర్గాలు ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. పూజల అనంతరం కవితకు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను మంత్రి తలసాని ట్విట్టర్ లో పంచుకున్నారు.
Kalvakuntla Kavitha
CM KCR
Birthday
Balkampet Ellamma Temple
Hyderabad
TRS
Telangana

More Telugu News