Gautam sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా తాజా మాజీ డీజీపీ గౌతం స‌వాంగ్‌ను నియ‌మించిన ప్ర‌భుత్వం

  • గవర్నర్ కు ఏపీ స‌ర్కారు ప్ర‌తిపాద‌నలు
  • ఇటీవ‌లే స‌వాంగ్ బ‌దిలీ
  • ఆరు నెలలుగా ఏపీపీఎస్సీ చైర్మన్ ప‌ద‌వి ఖాళీ
sawang appoints as appsc chairman

ఏపీ డీజీపీ పదవి నుంచి గౌతం సవాంగ్ ను బదిలీ చేసిన ప్ర‌భుత్వం ఆయ‌న స్థానంలో ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని నియమించిన విష‌యం తెలిసిందే. గౌతమ్‌ సవాంగ్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆయ‌న‌ను ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది.

ఈ మేరకు ప్ర‌భుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వ‌చ్చింది. ఉదయం ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను గవర్నర్‌ భిశ్వభూషణ్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపింది. గవర్నర్‌ ఆమోదం పొందిన తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. కాగా, ఏపీపీఎస్సీ చైర్మన్‌‌గా ఉన్న ఉదయ్‌భాస్కర్ పదవీ కాలం ఆరు నెలల క్రితం ముగిసిన‌ప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది.

More Telugu News