carrots: క్యారెట్లను ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం?

  • క్యారెట్ ను నేరుగా తినొచ్చు
  • లేదంటే జ్యూస్ చేసుకుని మొత్తంగా తీసుకోవాలి
  • వీటిల్లో బీటా కెరోటిన్ పుష్కలం
  • కంటి, కణాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది
best ways to consume carrots for maximum health benefits

క్యారెట్ ఎంతో ఆరోగ్య ప్రదాయని. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుందని తెలిసిందే. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంచడంలో దీని పాత్ర ఉంది. అంతేకాదు, యాంటీ ఆక్సిడెంట్ కూడా. కేన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. బీటా కెరోటిన్ అన్నది 'విటమిన్ ఏ'కు పూర్వపు రూపం. శరీర అవసరానికి తగ్గట్టు విటమిన్ ఏగా మారుతుంది.
 
క్యారట్లలో ఒక్క బీటా కెరోటిన్ కాకుండా, ఆల్ఫా కెరోటిన్, బీటా క్రిప్టోక్సాంథిన్ కూడా ఉంటాయి. వీటిని కెరటాయిడ్స్ అంటారు. ఒక మీడియం సైజు క్యారెట్ తో 4 మిల్లీగ్రాముల బీటా కెరోటిన్ లభిస్తుంది. క్యారెట్ ను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. కెరటాయిడ్స్ తోపాటు, విటమిన్ సీ, విటమిన్ ఈ, సిలీనియం, లైకోపీన్, లూటెనిన్, జెక్సాంథిన్ వీటిని యాంటీ ఆక్సిడెంట్లుగా చెబుతారు.
 
క్యారెట్ లో ఏ భాగాన్నీ తీసిపడేయకుండా మొత్తంగా తినేయడం మెరుగైన మార్గం. ఒకవేళ జ్యూస్ చేసుకుంటే అందులో నుంచి ఏమీ తీయకుండా మొత్తంగా తాగేయాలి. కేన్సర్ బాధితులు అయితే పొట్టు తీసిన క్యారెట్ ను తీసుకోవాలి. వీరికి ఇన్ఫెక్షన్ ముప్పు ఉంటుంది. అందుకే ఇలా చేయాలి.

డయాబెటిస్ ఉన్న వారు కూడా క్యారెట్ ను పరిమితంగా తీసుకోవాలి. ఒక క్యారెట్ తినడం లేదంటే ఒక కప్పు జ్యూస్ చేసుకుని తాగడం చేయవచ్చు. ఒకటి రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె, బీట్ రూట్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి వేసుకుని కూరలా చేసుకుని కూడా తినొచ్చు. కెరటాయిడ్లు క్యారెట్ తోపాటు గుమ్మడి, బొప్పాయి, టమాటా, చిలగడదుంపలోనూ లభిస్తాయి.

More Telugu News