Nani: నాని, కీర్తి సురేశ్ సినిమా షూటింగ్ ప్రారంభం!

  • దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీకాంత్ ఓదెల
  • ప్రధాన పాత్రలను పోషిస్తున్న సముద్రఖని, సాయికుమార్
  • పూజా కార్యక్రమానికి హాజరైన సుకుమార్, తిరుమల కిశోర్
Nani and Keerthy Suresh new film launched

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ కొత్త సినిమా 'దసరా' షూటింగ్ ప్రారంభమైంది. ఈరోజు పూజాకార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు సుకుమార్, తిరుమల కిశోర్ హాజరయ్యారు. మార్చి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభకానుంది. ఈ చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, జరీనా తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

  • Loading...

More Telugu News