RGV: నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు? అంటూ యాంకర్ శ్యామలపై ఆర్జీవీ కామెంట్స్

RGV Shocking Comments On Anchor Shyamala
  • ఇంత అందంగా ఉన్నారని పొగడ్తలు
  • షాక్ అయి తెగ నవ్వేసిన శ్యామల
  • 'బడవ రాస్కెల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఘటన

యాంకర్ శ్యామలపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు. 'బడవ రాస్కెల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ఆ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న శ్యామలపై పొగడ్తల వర్షం కురిపించారు. స్టేజీపైకి వచ్చి మైక్ అందుకున్న వర్మ.. తాను రాస్కెల్ నని చెప్పుకొచ్చారు.

శ్యామల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు?’’ అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ కు షాక్ అయిన శ్యామల.. తెగ నవ్వేసింది. కాగా, తనను తోపు, రౌడీ, గూండా ఇలా అన్ని పేర్లతోనూ పిలిచారని, కానీ తాను రాస్కెల్ ను కూడా అంటూ వర్మ చెప్పుకొచ్చారు. ఇదిలావుంచితే, 'బడవ రాస్కెల్' సినిమా ఎల్లుండి (18న) విడుదల కానుంది.

  • Loading...

More Telugu News