LIC: ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనాలంటే పాలసీదారులకు ఇది తప్పనిసరి!

  • రూ. 63 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం
  • వచ్చే నెలలో ఐపీఓ ఉండే అవకాశం
  • ఐపీఓలో పాల్గొనాలంటే పాన్ నంబరు తప్పనిసరి
  • ఉద్యోగులు, పాలసీదారులకు రాయితీతో షేర్లు!
Deadline for policyholders to update PAN to apply for shares

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే ఐపీఓకి వెళ్తున్న నేపథ్యంలో తమ పాలసీదారులకు ఆ సంస్థ కీలక సూచన చేసింది. పబ్లిక్ ఇష్యూలో పాల్గొనాలంటే తప్పనిసరిగా పాన్ నంబరు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నెల 28లోగా పాన్ నంబరు నమోదు చేసుకోవాల్సిందేనని, అలా నమోదు చేసుకున్న వారికే ఐపీఓలో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొంది.

రూ.63 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించేందుకు ఎల్ఐసీ రెడీ అయింది. వచ్చే నెలలో ఐపీఓ ఉండే అవకాశం ఉంది. ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీదారులు ఇందులో రాయితీతో షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే, ఇందుకోసం పాలసీదారులు తమ పాన్ నంబరు వివరాలను ఈ నెల 28లోగా ఎల్ఐసీ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా గానీ, ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా కానీ, లేదంటే ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా కానీ పాన్ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

More Telugu News