Siddhu Jonnalagadda: సక్సెస్ మీట్ కి రెడీ అవుతున్న 'డీజే టిల్లు'

  • ఈ నెల 12న వచ్చిన 'డీజే టిల్లు'
  • తొలి రోజునే సక్సెస్ టాక్
  • వైజాగ్ లో సక్సెస్ మీట్
  • రేపు సాయంత్రం 6:30 గంటల నుంచి మొదలు
DJ Tillu movie update

సిద్ధు జొన్నలగడ్డ ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయింది. హీరోగా నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'డీజే టిల్లు' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, సిద్ధూ సరసన నాయికగా నేహా శెట్టి కనువిందు చేసింది.

సితార బ్యానర్ నుంచి ఈ సినిమా రావడంతో అందరూ కూడా దృష్టిపెట్టారు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. దాంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

ఈ సినిమా సక్సెస్ మీట్ ను రేపు వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం 6:30 గంటల నుంచి ఈ సక్సెస్ మీట్ మొదలుకానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. శ్రీచరణ్ పాకాల సంగీతం .. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు.

More Telugu News