Manchu Vishnu: జగన్ తో చాలా విషయాలు చర్చించా.. తిరుపతిలో సినిమా స్టూడియో పెడతా: మంచు విష్ణు

Will construct film studio in Tirupathi says Manchu Vishnu after meeting with Jagan
  • జగన్ తో చాలా విషయాల గురించి మాట్లాడాను
  • చర్చలకు నాన్నగారిని పిలవలేదనేది దుష్ప్రచారం
  • విశాఖకు సినీ పరిశ్రమ తరలింపుపై ఆలోచిస్తాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మంచు విష్ణు భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు. సీఎంతో తాను చాలా విషయాల గురించి మాట్లాడానని చెప్పారు. జగన్ తో మాట్లాడిన విషయాలు వ్యక్తిగతమైనవని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చించామని చెప్పారు. తిరుపతిలో తాను సినిమా స్టూడియో పెడతానని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చలకు నాన్న గారిని పిలవలేదనేది దుష్ప్రచారమని చెప్పారు. విశాఖకు సినీ పరిశ్రమను ఎలా తరలించాలనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు అని చెప్పారు. సినీ పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబమని అన్నారు.

  • Loading...

More Telugu News