Telugu cinemas: ఈ వారం థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు ఇవే!

Telugu cinemas releasing this week in theatres and OTTs
  • 18న థియేటర్లకు 'సన్నాఫ్ ఇండియా' చిత్రం
  • జీ5లో విడుదల కానున్న 'బంగార్రాజు'
  • డిస్నీ హాట్ స్టార్ లో వస్తున్న '83'
కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు చేరుకుంటున్న తరుణంలో సినీ పరిశ్రమలో మళ్లీ పాత జోష్ కనిపిస్తోంది. థియేటర్లలో సందడి చేసేందుకు పలు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఓటీటీల ద్వారా సినిమాలు ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో వస్తున్న సినిమాలు ఇవే.

థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు:
మోహన్ బాబు, శ్రీకాంత్, మీనా, ప్రగ్యా, పోసాని కృష్ణమురళి నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ధనుంజయ, అమృత అయ్యంగార్, రఘు తదితరులు నటించిన 'బడవ రాస్కెల్' చిత్రం కూడా 18న థియేటర్లకి వస్తోంది. అజయ్ కతుర్వాన్, డింపుల్ తదితరులు నటించిన 'విశ్వక్'... అక్షత శ్రీనివాస్, వినోద్ అనిల్ తదితరులు నటించిన 'సురభి 70 ఎంఎం' సినిమాలతో పాటు 'గోల్ మాల్', 'వర్జిన్ స్టోరీ', 'బ్యాచ్', 'నీకు నాకు పెళ్లంట' సినిమాలు కూడా 18న విడుదల కాబోతున్నాయి.

ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు:
నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన 'బంగార్రాజు' జీ5లో ఫిబ్రవరి18న విడుదలవుతోంది. రణవీర్ సింగ్, దీపిక పదుకునే, జీవా తదితరులు నటించిన బాలీవుడ్ చిత్రం '83' తెలుగు వర్షన్ డిస్నీ హాట్ స్టార్ లో 18న వస్తోంది. దీంతో పాటు విశాల్, ఆర్య నటించిన 'ఎనిమి' చిత్రం సోని లివ్ లో ఫిబ్రవరి 18న రానుంది.
Telugu cinemas
Release
This Week
Tollywood
OTT

More Telugu News