బాలికలను ఇలా పాఠశాలల గేట్ల వద్ద అవమానించడం మానేయాలి: గుత్తా జ్వాల
- పాఠశాలలకు బాలికలు తమను తాము శక్తిమంతం చేసుకోవడానికి వస్తారు
- స్కూలే వారి సురక్షిత స్వర్గం
- నీచ రాజకీయాల నుంచి బాలికలను తప్పించాలి
- హిజాబ్ వివాదంపై గుత్తా జ్వాల
తాజాగా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఈ వివాదంపై స్పందించింది. బాలికలను స్కూళ్ల గేట్ల వద్ద అవమానించడం మానేయాలని ఆమె సూచించింది. పాఠశాలలకు బాలికలు తమను తాము శక్తిమంతం చేసుకోవడానికి వస్తారని, స్కూలే వారి సురక్షిత స్వర్గంగా ఉంటుందని అన్నారు. నీచ రాజకీయాల నుంచి బాలికలను తప్పించాలని ఆమె కోరింది. చిన్నారుల మనసుల్లో మచ్చపెట్టకూడదని ఆమె పేర్కొంది. హిజాబ్ పేరిట చెలరేగుతోన్న వివాదాన్ని ఆపాలని కోరింది.