Medaram Jathara: మేడారం జాతరలో.. విధినిర్వహణలో కానిస్టేబుల్ మృతి!

  • జాతర బందోబస్తుకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ రమేశ్
  • ఈ ఉదయం 6 గంటల సమయంలో గుండెపోటు 
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి
Head Constable died in Medaram Jathara

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతర బందోబస్తుకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ బి.రమేశ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన సమ్మక్క సారలమ్మ ఎగ్జిట్ గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో ఆయనకు ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. రమేశ్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందినవారు. ఆయన మరణంతో మేడారంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో విషాదం నెలకొంది. మరోవైపు ఆయన భౌతికకాయాన్ని అంబులెన్సులో ఇంటికి తరలించారు.

More Telugu News