Rajamouli: రాజమౌళి సినిమాలో చేయడమే నా చివరి కోరిక: ఆమని

Amani wanted to acting Rajamouli movie
  • నటిగా ఆమనికి మంచి క్రేజ్
  • వివాహం తరువాత వచ్చిన గ్యాప్  
  • ప్రస్తుతం కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ
  • తన మనసులో మాట చెప్పిన ఆమని  
టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన కథానాయికగా ఆమని కనిపిస్తారు. తెలుగులో 'శుభలగ్నం' .. 'శుభ సంకల్పం' .. 'మిస్టర్ పెళ్లాం' వంటి సినిమాలు ఆమె నటనకు కొలమానంగా నిలుస్తాయి. తెలుగులో బాపు .. కె విశ్వనాథ్ వంటి దర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం.

వివాహమైన తరువాత కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్న ఆమని, ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా ఆయా సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. తన మేనకోడలు హ్రితిక నటించిన 'అల్లంత దూరాన' సినిమా ప్రమోషన్స్ లో ఆమె కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ .. "ఇంతవరకూ ఎన్నో విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చాను. అయినా నేను ఇంకా ఒక నటిగా సంతృప్తి చెందలేదు. అలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను. నా చివరి కోరిక ఏదైనా ఉందంటే, అది రాజమౌళి సినిమాలో చేయాలనేదే. ఆయన సినిమాలో చిన్న వేషమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని చెప్పుకొచ్చారు.
Rajamouli
Amani
Hrithika
Allantha Doorana Movie

More Telugu News