man arrest: ఏడు రాష్ట్రాలలో 14 మందితో పెళ్లిళ్లు.. నిత్య పెళ్లికొడుకు అరెస్ట్!

  • మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా మహిళలకు చేరువ
  • పెళ్లి చేసుకుని డబ్బు దండుకునే యత్నం
  • భువనేశ్వర్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Man Who Married 14 Women In 7 States Arrested In Odisha

ఎప్పటికప్పుడు ప్రాంతాలు మారుస్తూ, కొత్త పెళ్లికొడుకులా ఒకరి తర్వాత ఒకరిని వివాహమాడుతూ మోసగిస్తున్న వ్యక్తిని (48) భువనేశ్వర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని కేంద్రపర జిల్లా పత్కుర పోలీస్ స్టేషర్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సదరు వ్యక్తి ఇప్పటి వరకు 14 మందిని వివాహమాడినట్టు భువనేశ్వర్ డీసీపీ ఉమేష్ కుమార్ దాస్ తెలిపారు.

1982లో ఇతను మొదటి సారి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2002లో రెండోసారి పెళ్లిపీటలు ఎక్కాడు. ఈ ఇద్దరు భార్యలకు కలిపి ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో ప్రొఫైల్ పెట్టి సంబంధం వెతుక్కునేవాడు. ఈ విషయం భార్యలకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఇలా 14 మంది మహిళలను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. చివరి భార్య ఢిల్లీలో స్కూల్ టీచర్, ఆమెకు తన భర్త పూర్వపు వివాహాల గురించి తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విడాకులు తీసుకుని, ఒంటరి జీవితం గడుపుతున్న మహిళల కోసం మాట్రిమోనీ సైట్లలో వెతికేవాడు. తానొక డాక్టర్ నని అబద్ధమాడుతూ వాళ్లను బుట్టలో వేసుకునేవాడు. అలా తన వలలో పడిన వారిని పెళ్లి చేసుకున్న తర్వాత వారి వద్ద డబ్బు తీసుకుని ఉడాయించడమే అతడి వ్యాపకంగా మారిపోయింది. ఇతడి బాధిత భార్యల్లో కేంద్ర పారా మిలటరీ దళంలో పనిచేసే మహిళ కూడా ఉండడం గమనార్హం. ఢిల్లీ, పంజాబ్, అసోమ్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో ఇతడికి భార్యలు ఉన్నారు.

  • Loading...

More Telugu News