Telangana: రాష్ట్రాల దయాదాక్షిణ్యాల వల్లే కేంద్రం బతుకుతోంది: తలసాని

center living on states mercy said talasani
  • మోదీకి తెలంగాణ భయపడదు
  • పాకిస్థాన్, మతం.. ఈ రెండింటి పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం ఒక్కటే బీజేపీకి తెలుసు
  • రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో చెప్పగలరా?
  • బీజేపీకి తలసాని సవాల్
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలంగాణ భయపడదని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిన్న మంత్రి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీపై దుమ్మెత్తి పోశారు. బీజేపీ వాడుకునేందుకు పాకిస్థాన్, మతం చక్కగా దొరికాయని, ఈ రెండింటి పేరు చెప్పి రెచ్చగొట్టడం ఒక్కటే ఆ పార్టీకి తెలుసని అన్నారు. హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

పారిశ్రామికవేత్తల కోసం వ్యవసాయ మోటార్లను మీటర్లు బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపైనే కేంద్రం బతుకుతోందన్నారు. కేంద్రానికి రాష్ట్రం ఏమిచ్చిందో తాము చెబుతామని, మరి రాష్ట్రానికి ఏమిచ్చిందో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పగలరా? అని నిలదీశారు. ఈ విషయంలో తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.
Telangana
TRS
BJP
Talasani
Narendra Modi

More Telugu News